కేంద్ర కేబినెట్… వారికి కేటాయించిన శాఖలివే….!

కేంద్ర కేబినెట్లో ప్రధాన నరేంద్రమోడీ భారీ ప్రక్షాళన చేశారు. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. వారిలో 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.. ఎవరెవరికి ఏ శాఖ అనేది వరుసగా….
- నరేంద్ర మోడీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖ
- రాజ్నాథ్ సింగ్ – రక్షణ శాఖ
- అమిత్షా – హోంశాఖ, సహకారశాఖ
- నితిన్ గడ్కరీ – కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ
- నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాలు
- నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం మరియు రైతు సంక్షేమం
- డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశాంగ శాఖ
- అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాల శాఖ
- స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
- పీయూష్ గోయల్ – వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ
- ధర్మేంద్ర ప్రదాన్ – విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
- ప్రహ్లాద్ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
- నారాయణ్ రాణే – చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
- సర్బానంద సోనోవాల్ – పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాలు, ఆయుష్ శాఖ
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనారిటీ వ్యవహారాలు
- డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం మరియు సాధికారత
- గిరిరాజ్ సింగ్ – గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్
- జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ
- రామచంద్ర ప్రసాద్ సింగ్ – ఉక్కు శాఖ
- అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
- జి. కిషన్రెడ్డి – పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
- హర్దీప్ సింగ్ పూరీ – పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
- మన్సుఖ్ మాండవీయ – ఆరోగ్యశాఖ
- అనురాగ్ఠాకూర్ – సమాచార, ప్రసారాలు, క్రీడలు
- పీయూష్ గోయల్ – వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ
- పశుపతి కుమార్ పారస్ – ఫుడ్ ప్రాసెసింగ్
- పురుషోత్తం రూపాల – డెయిరీ, మత్స్య శాఖ
- గజేంద్రసింగ్ షెకావత్ – జల్శక్తి
- పురుషోత్తమ్ రూపాల – మత్స్య, పశుసంవర్దక, డెయిరీ
- కిరణ్ రిజిజు – న్యాయశాఖ
- రాజ్కుమార్ సింగ్ – విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ
- భూపేంద్ర యాదవ్ – పర్యావరణ, అటవీశాఖ, కార్మిక శాఖ
- మహేంద్రనాథ్ పాండే – భారీ పరిశ్రమల శాఖ