కేంద్రం కీలక నిర్ణయం… మరో ఐదు నెలలు రేషన్ ఉచితం…
కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. దీంతో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్ను ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్ను అందించింది. అదేవిధంగా ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ను అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
అలాగే బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అందించాలని తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే సెకండ్ వేవ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో పాటుగా, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు అందుతున్న ఈ సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.