‘కూ’లో స్వీటీ ఫాలోవర్స్ మామూలుగా లేదుగా…!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తాజాగా ‘కూ’ యాప్ లో చేరిన విషయం తెలిసిందే. ట్విట్టర్ కు ప్రత్యామ్యాయంగా వచ్చిన ఈ యాప్ లో ఇప్పుడిప్పుడే తారలతో పాటుగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. అయితే స్వీటీ ఇప్పటికే ఉన్న సోషల్ నెట్వర్క్ లో పెద్దగా యాక్టీవ్ గా లేరు. కానీ ‘కూ’ లో మాత్రం బాగా జోరు చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చి చేరడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
అయితే తాజాగా అనుష్క తన బిఎఫ్ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) తో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అదేమంటే… ‘జీవితం గడుస్తున్న కొద్దీ మా మార్గాలు మారవచ్చు, కానీ.. స్నేహితుల మధ్య ఉన్న బంధం మాత్రం ఎప్పుడూ బలంగా ఉంటుంది’ అని అనుష్క మంచి క్యాప్షన్ కూడా సెలవిచ్చారు. మొత్తానికి ఆమె పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు ప్రేమతో కామెంట్ల వర్షం కురిపిస్తుండటం కూ నే ఊపేస్తుంది. ఇదిలా ఉండగా…. అనుష్క కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు సమాచారం అందుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానున్న ఈ సినిమాలో స్వీటీ ఇద్దరి కవల పిల్లలతో ఒంటరి తల్లిగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయం పై అధికారక ప్రకటన కోసం ఫ్యాన్స్ వేచి చూస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *