కూతురు కోసం గడ్డం తీసేసిన మంచు విష్ణు…

టాలీవుడ్ ను కరోనా ఓ కుదుపు కుదుపుతుంది. కరోనా కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో చాలామంది హీరోలు వర్కౌట్స్ కు పరిమితమై పోయారు. షూటింగ్స్ బంద్ చేశారు. దీంతో రెగ్యులర్ గా చేసుకునే గడ్డాలకూ సెలవు చెప్పేశారు. ఇదే దారిలో మంచు విష్ణు కూడా పయనించాడు. అయితే గత యేడాది మార్చి నుంచి గడ్డం పెంచుతూనే ఉన్నాడు. మరి తాజాగా అతని కూతురు ఆరియానా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి, మంచు విష్ణు క్లీన్ షేవ్ చేసేసుకున్నాడు. దీనికి తాతయ్య మోహన్ బాబును ఆరియానా జడ్జి గా పెట్టుకుంది. తండ్రి గడ్డం తీసేస్తే నెల రోజుల పాటు అతను చెప్పిన మాట వింటానని హామీ ఇచ్చింది.
మొత్తానికి మంచు విష్ణు ఇందుకు కరిగిపోయాడు. తన కూతురు తన మాట ఎప్పుడూ వినలేదని ఆరోపిస్తూనే, ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్ కలిగిస్తున్నందున గెడ్డం తీసేస్తున్నట్టు విష్ణు చెప్పాడు. అతను క్లీన్ షేవ్ చేసుకుంటున్న వీడియోను మంచు లక్ష్మీ షూట్ చేసింది. పొడుగాటి గడ్డంను పిల్లల కోసం త్యాగం చేసిన విష్ణును చూసి, మోహన్ బాబు దంపతులు అభినందించారు. పిల్లలు ప్రేమగా తండ్రిని ఆలింగనం చేసుకుని ముద్దుల వర్షం కురిపించారు. కాగా అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. మొత్తానికి నలుగురు పిల్లల తండ్రి విష్ణు… తాను పర్ ఫెక్ట్ ఫ్యామిలీ మేన్ అని మరోసారి నిరూపించుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *