కుంభమేళాపై కరోనా పంజా… సాధువు మృతి..
కుంభమేళాపై కరోనా పంజా విసురుతుంది. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా కోరలు చాసింది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం రోజున నిర్వహించిన రాజస్నానం కార్యక్రమంలో లక్షల సంఖ్యలో సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇలా రాజస్నానం చేసేందుకు హాజరైన నాగా సాధువుల్లో 30 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో కుంభమేళాలో అలజడి మొదలైంది. నిరంజని, జావాతో పాటుగా అనేక అఖాడాకు చెందిన సాధువులు కరోనా బారిన పడినట్టు వైద్యనిపుణులు వె చెప్తున్నారు. సాధువులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆల్ ఇండియా అఖాడా పరిషత్ నాయకుడు మహంత్ నరేంద్రగిరి కరోనా బారిన పడ్డారు. అదే విధంగా నిరంజని అఖాడా కుంభమేళాను వీడేందుకు రెడీ అయ్యారు. నిరంజని అఖాడాకు చెందిన సాధువులు కుంభమేళాను వీడేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే మహా నిర్వాణ అఖాడా హెడ్, ప్రముఖ సాధువు స్వామి కపిల్ దేవ్ కరోనాతో మృతి చెందారు. కాగా డెహ్రాడూన్ లో చికిత్స పొందుతూ మృతి చెందటంతో మహా నిర్వాణ అఖాడాలో ఆందోళనలు నెలకొన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభమేళాకు హాజరయ్యే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.