కియా నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్…
ఇండియాలో కియా మోటార్స్ సంచలనాలు సృష్టిస్తుందనే చెప్పాలి. కియా కార్లు ఇండియాలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాయి. అయితే తాజాగా కియానుంచి తొలి ఎలక్ట్రిక్ కారు వెలువడింది.
అలాగే మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈవీ6 పేరుతో తయారు చేసిన ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్టు కియా సంస్థ తెలిపింది. అదేవిధంగా ఈ కారు ధర ఎంత ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. ఇంకా ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనేది కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
కాగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్లు అంటే టెస్లానే అని అంటారు. ఇప్పుడు కియా నుంచి కూడా అదే రేంజ్ లో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుండటంతో మార్కెట్ లో ఆసక్తి నెలకొంది.