కర్ఫ్యూని పొడిగించిన ఏపీ ప్రభుత్వం …..
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కర్ఫ్యూ, కరోనా కేసుల విషయంపై ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
అదేవిధంగా కరోనా కేసులు కట్టడి కావాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని, ప్రస్తుతం కర్ఫ్యూ అమలులోకి వచ్చి 10 రోజులు మాత్రమే అయ్యిందని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్ల కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించడం మేలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. దీంతో మే 31 వరకు కర్ఫ్యూ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో రోజువారీ కరోనా కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. కాగా పాజిటివిటి రేటు 25శాతానికిపైగా ఉండటంతో కరోనా.. కట్టడికి కఠిన చర్యలు తీసుకోక తప్పదని అధికారులు వెల్లడిస్తున్నారు.