కర్నూలులో ఘోరం… అప్పులబాధతో నలుగురు ఆత్మహత్య…

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. నంద్యాల మాల్దార్పేటలో తీవ్ర విషాదం అలముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది.
అసలు ఏం జరిగింది అంటే… ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్, కళావతి, అంజలి(16), అఖిల(14)గా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలుపుతున్న ప్రాథమిక ఆధారాలను బట్టి వీరు అప్పుల బాధ తాలలేక ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్తున్నట్లు తెలుస్తోంది