కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీనియర్ నటీమణి
దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ అంటూ తిరిగి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఇలాంటి సమయంలో కరోనా వ్యాక్సినేషన్ తప్ప మరో మార్గం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు అనేక దేశాలు ఇప్పటికే ప్రయోగాలు చేశారు. మొత్తానికి కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ను విజయవంతంగా తయారు చేశారు. వ్యాక్సిన్ తయారు కావడంతో అనేక దేశాలు వ్యాక్సినేషన్ ప్రారంభించేశాయి కూడాను.
అయితే కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన దేశాలలో భారత్ కూడా ఉంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ను భారత ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈనెల1వ తేదీ నుంచి రెండవ విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీయర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్నారు. అందుకు సంబంధించి రాధికా ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు మీ ఆప్తులను కూడా కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకోండి’ అని రాధిక ట్వీట్ చేశారు. నిజమే. ఈ రెండవ విడత ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటుంటడం విశేషం.