కరోనా ఎఫెక్ట్.. జంట నగరాల్లో ఎటు చూసినా టూ లెట్ బోర్డులే…

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తిరిగి భారీగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహా నగరంపై కరోనా ప్రభావం బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో కరోనా ప్రభావం బయటకు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేమంటే… అలా బయటకు వచ్చి చూస్తే చాలు టూలెట్ బోర్డుల్ విపరీతంగా దర్శనమిస్తున్నాయి.
ముఖ్యంగా కోటికి పైగా జనాభా ఉండే నగరంలో ఉపాధి కోసం కొందరు.. ఉద్యోగం కోసం మరికొందరు.. చదువు కోసం ఇంకొందరు.. ఎంతో మంది ప్రతీ రోజు భాగ్యనగరానికి వస్తుంటారు. పోతుంటారు. ఇది ఓ నిరంతర ప్రవాహంలా సాగుతుంది. నిత్యం కోట్లలో వ్యాపారం సాగుతుంటుంది. అయితే ఇప్పడు నగరంలో జనాలకు ఓ రకమైన భయం పట్టుకుంది. తెలియని భయం ప్రజల్లో నెలకుంది.
అయితే ఇప్పుడు కరోనా కారణంగా నగరంలోని ఐదు, పది ఇళ్లకు ఒక టూ లెట్ బోర్డ్ దర్శనమిస్తోంది. కరోనాతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోవడం, వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ఇష్టం చూపకపోవడంతో టూలెట్ బోర్టులు అలాగే ఉన్నాయి. ప్రధానంగా చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు అద్దె ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఏ గల్లీలో చూసినా… టూ లెట్ బోర్డులు కనిపిస్తుండటం ఆశ్చర్యమేస్తుంది. జనజీవన స్థితిగతులను తలకిందులు చేసింది కరోనా రక్కసి ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ మొదలుకావడంతో బతుకు జీవుడా అంటూ సొంత ఊళ్లకు అడపాదడపా వచ్చిన వారు కూడా వలసబాట పడుతున్నారు. దీంతో ప్రతీ గల్లీలో ఐదారు ఇళ్లకు ఒక టూ లెట్ బోర్డు కనిపిస్తుంది. గతంలో టూ లెట్ బోర్డు ఉదయం పెడితే… మధ్యాహ్ననికి కనిపించేది కాదు. కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్నా గేటు ముందు బోర్డు వేలాడుతూనే కనిపిస్తోంది. ఇల్లు ఖాళీగా ఉండడం వల్ల నష్టపోతున్నామని, తక్కువ అద్దెకు ఇస్తామని చెప్తున్నప్పటికీ.. ఎవరూ రావడం లేదని ఇంటి యజమానులు వాపోతున్నారు. ఇదే సమయంలో అద్దెలు కూడా భారీగానే తగ్గాయి.
అదేవిధంగా సిటీలో ఎలాంటి పనులు లేక.. తిండి గడవక పస్తులుండటం కంటే సొంతూళ్లలో గంజి నీళ్లైనా తాగి బతకడం మేలనుకొని నగరం విడిచి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే కరోనా రక్కసి ప్రజల జీవనాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేసిందో గమనించవచ్చు. నగరంలో కరోనా తిరిగి విజృంభిస్తుండటం… విద్యార్థులకు చాలా కష్టంగా మారింది. ఉద్యోగుల విషయానికి వస్తే.. అసలు వచ్చేది అంతంత మంత్రం అందులో 40% వరకు ఇంటి అద్దెకే పోతుందని ఆవేదన చెదుతున్నారు. ఇంకా హాస్టల్స్ లో ఉండేవారైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో హాస్టల్స్ ను మూసివేశారు. తిరిగి ప్రారంభించినా… విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో చాలా మంది విద్యార్ధులు నగరానికి చేరుకోలేదు. దీంతో నడిపించలేక చాలా మంది హాస్టళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే సంవత్సర కాలంగా హాస్టళ్లలో ఉంటున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు వందల్లో ఉండే హాస్టళ్లు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఉన్నవారిపై ఎక్కువ భారం మోపుతున్నారు నిర్వాహకులు. ఒకవేళ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఒక నెల హాస్టల్ ఫీజు చెల్లించాల్పిందే. మొత్తానికి కరోనా ఎపెక్ట్ నగర జీవుల జీవితాలను అతలాకుతలం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *