కరోనాకు మరో జర్నలిస్ట్, నటుడు బలి….

తెలుగు మీడియా, కళాలోకం దిగ్భ్రాంతికి గురి చేసే మరో వార్త కరోనా కారణంగా వినాల్సి వచ్చింది. కరోనాకు మరో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు మృత్యువాత పడ్డాడు. ఇండియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరి జీవితాలను బుగ్గిపాలు చేస్తింది. ముఖ్యంగా సినీ పరిశ్రమను కరోనా ఓ కుదుపు కుదుపుతుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ కరోనా తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులను కరోనా బలితీసుకుంది.
అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు కరోనాతో మృతి చెందడం చిత్రపరిశ్రమను షాక్ కు గురిచేసింది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) మృత్యవాత పడటం మీడియా లోకాన్ని, సినీ పరిశ్రమను సోకసంద్రంలో పడేసింది. గత కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడం వైద్యం తీసుకోగా మెరుగైంది. అయితే హఠాత్తుగా ఆదివారం శ్వాసకు సంబందించి ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటినా సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఒక్కసారిగా ఆరోగ్యం విషమించిందని, పల్స్ రేట్ బాగా పడిపోయిందని సన్నిహితులు వెల్లడించారు. సోమవారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్ పై వైద్యం అందించారు. అయినా ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. అలా ఆరోగ్యం మరింత విషమించి సోమవారం ఉదయం టీఎన్ఆర్ మృతి చెందారు. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టీఎన్ఆర్ మృతి చెందడంతో మీడియా లోకం దిగ్బ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. ఆయన మృతి వార్త వినగానే.. అంతా విషాదంలోకి వెళ్లిపోయారు. ఓ ప్రముఖ యూ-ట్యూబ్ లో ప్రసారమయ్యే.. ఫ్రాంక్లి విత్ టీఎన్ఆర్ షోతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. కాగా టీఎన్ఆర్ మృతి జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు అంటూ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *