కన్నడ రాసలీలల మంత్రి కేసులో కీలక ట్విస్ట్
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహొళి సెక్స్ కుంభకోణం కేసు కీలక మలుపులు తీసుకుంటుంది. రమేష్ జర్కిహోలి మంత్రి అన్న హోదాని మరచి పని చేసిపెట్టమని వచ్చిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలు బయటకు రావడంతో జార్కిహోలి కామకేళి బండారం మొత్తం బయటకు వచ్చింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అవమాన భారంతో మంత్రి రాజీనామ చేయక తప్పలేదు. అయితే ఈ సెక్స్ స్కాండిల్లో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అదేమంటే ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో మంత్రి రమేష్ రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ సామాజిక కార్యకర్త, ఫిర్యాదు దారు దినేశ్ కలహళి తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం తీవ్ర చర్చలకు దారి తీస్తుంది. ఈ విషయంలో రాజకీయ పెద్దల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా బాధితురాలి పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుండటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దినేష్ కలహళి వెల్లడిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా ఓ లేఖను తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్కు పంపించారు. ఫిర్యాదు ఉపసంహకరించుకోవడం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని కూడా స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా జార్కిహోలి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు కూడాను.