కన్నడ రాసలీలల మంత్రికేసుకు సీబీఐ అక్కరలేదు

కన్నడ మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసును సిట్ నుంచి సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ రాసలీలల కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు న్యాయవాదులు వేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్.ఓకా నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ల వాదనల్ని ఆలకించిన న్యాయస్థానం సిట్ చీఫ్ సౌమేందు ముఖర్జీ అందించిన విచారణ నివేదికను కూడా క్షుణ్ణంగా పరిశీలించింది.
ఇదే సమయంలో ఈ కేసులో నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించి ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన పని లేదని తెలిపింది. అలాగే తర్వాత విచారణను మే 31 కి వాయిదా వేసింది. కాగా కేసు దర్యాప్తు సమాచారం మీడియాకు లీక్ అవుతోందని, టీవీ చానెళ్లలో విచారణ మాదిరిగా చర్చాగోష్టులు నడుస్తున్నాయని వాదానలు జరిగాయి. దీంతో మీడియాను కట్టడిచేయాలని కోరారు. ఈ వాదనల్ని తిరస్కరించిన న్యాయస్థానం ఏ ఆధారంతో ప్రభుత్వం మీడియాను కట్టడి చేయాలని ప్రశ్నించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *