కడప బస్టాండ్ కు వైఎస్ఆర్ పేరు…
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా పుంగనూరు బస్సు డిపోను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు సీఎం వైయస్ జగన్. ఈ సందర్బంగా కడప బస్ స్టేషన్కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి బస్ స్టేషన్గా వైఎస్ జగన్ సర్కార్ పేరు మార్పు చేసింది. అలాగే కడపలో ఏపీఎస్ఆర్టీసికి చెందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏరియా ఆస్పత్రిని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు వైయస్ జగన్.
అయితే ఈ తరుణంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్ వైయస్సార్ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. అలాగే కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయమని.. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. కాగా వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని.. ఇది దేవుడు తనకు ఇచ్చిన అదృష్టమని సీఎం జగన్ వెల్లడించారు.