ఐపీఎల్ కు కరోనా ఎఫెక్ట్.. ఆట ఉంటుందంటారా…?

దేశంలో కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ అంటూ మొదటిసారి కంటే ఈ సారి వ్యాప్తి అధికంగా ఉంది. ఇదే సమయంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి అంతా రెడీ అయింది. ఈ ఏడాది ఆరంభంలో కరోనా కేసులు తగ్గడంతో.. ఇక ఐపీఎల్ కు దిగుల్లేదు అనుకున్నారు అభిమానులు. కానీ ఫిబ్రవరి నుంచి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మార్చి చివరి నాటికి తీవ్రతరమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకి లక్ష కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఐపీఎల్ నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. సీజన్ ప్రారంభానికి ముందే వైరస్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ తో పాటు ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. అక్షర్ పటేల్.. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ.. మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్షర్ ఇంకా బయో బబుల్లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. మొదట కోల్కతా నైట్రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు.
అంతేకాకుండా చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడికి కూడా కోవిడ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. మహారాష్ట్రలో రోజుకీ 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కోవిడ్ సోకింది. వీరితో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐకి టెన్షన్ పట్టుకుంది. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం ప్రకటించింది. కాగా ఆటగాళ్లకు, సిబ్బందికి వరుసగా కరోనా సోకుతుండటంతో టోర్నీ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కలుగుతుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *