ఏప్రిల్ 30వ తేదీన అమెజాన్ లో వకీల్ సాబ్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఫస్ట్ డే కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ప్రీమియర్ షోస్ అనుకున్న విధంగా పడకపోవడం, టిక్కెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వాలు అంగీకరించక పోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం పడింది. దీంతోపాటు కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలు కావడంతో ఆంధ్రాలో థియేటర్ల ఆక్యుపెన్సీపై నిబంధనలు విధించారు.
అదేవిధంగా తెలంగాణలో కూడై నైట్ కర్ఫ్యూ విధించారు. దీంతో చాలా థియేటర్ల యాజమానులు స్వచ్ఛందంగా తమ థియేటర్లను మూసి వేశారు. అయినా కొద్ది రోజులుగా ‘వకీల్ సాబ్’ను కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. దీంతో నిర్మాత ‘దిల్’ రాజు అమెజాన్ ప్రైమ్ కు స్ట్రీమింగ్ హక్కులు ఇవ్వడం విశేషం. ఇదే నెల 30 తేదీన ‘వకీల్ సాబ్’ అమెజాన్ లో ప్రసారం కాబోతోంది. కరోనాకు భయపడి థియేటర్లకు రాలేకపోయిన వారికి ‘వకీల్ సాబ్’ చూసే అవకాశం కలగనుంది. మరిప్పుడు ఓటీటీలో ‘వకీల్ సాబ్’ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చిత్ర యాజమాన్యం ప్రకటించడం విశేషం.