ఏపీ హైకోర్ట్ సంచలన తీర్పు… పరిషత్ ఎన్నికలు రద్దు..
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్ట్ రద్దు చేసింది. ఎన్నికలను నిర్వహించిన తర్వాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.
అదేవిదంగా గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొనడం విశేషం. కాగా హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.