ఏపీ బడ్జెట్ భేష్ అంటూ స్వరూపానందేంద్రస్వామి ప్రశంసలు…
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2021-22ను ఈరోజు ఏపీ అసెంబ్లీ ప్రవేశ పెట్టింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా మూడోసారి కరోనాకాలంలో కూడా ఏమాత్రం తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులను ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి.. ఏపీ బడ్జెట్పై స్పందించారు.
ముఖ్యంగా అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని వెల్లడించారు. అలాగే దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అభినందనీయుడు అని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. తాము రిషికేశ్ లో ఉన్నామని.. ఈ వార్త విని ఎంతో ఆనందించామని వివరించారు. వైస్ జగన్మోహన్ రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని ఆయన వివరించారు.