ఏపీ డీజీపీ సవాంగ్ ని వదలని సైబర్ కేటుగాళ్లు..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ని సైబర్ నేరగాళ్లు వదలలేదు. టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కాలంలో సైబర్ నేరాగాళ్లు చాలా వేగంగా పంజా విసురుతున్నారు. ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. సమాచారాన్ని దొంగిలించి.. తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు ఆంధ్రా పోలీస్ బాస్ ని విడిచిపెట్టలేదు. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచారు సైబర్ నేరగాళ్లు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోటో పెట్టి అధికారిక ఖాతాగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా పలు ట్వీట్లు కూడా పెట్టారు. దీంతో.. డీజీపీ ఖాతాయే అనుకొని.. పలు జిల్లాల ఎస్పీలు కూడా అనురించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత దీనిని గుర్తించిన డీజీపీ కార్యాలయం.. వెంటనే ఖాతాను స్తంభింపజేసింది. డీజీపీ పేరుతోనే ఫేక్ ఖాతాను ఓపెన్ చేయడాన్ని సీరియస్గా తీసుకున్న బెజవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదుచేశారు. కాగా దీని వెనుక ఎవరున్నారు, ఏ ఐపీ అడ్రస్ వాడారు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మరి ఏం తేలుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *