ఏపీ-టీఎస్ బోర్డర్ లో భారీగా ట్రాపిక్ జామ్…
ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి రానుంది. దీంతో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంతూరు బాట పట్టారు. ఎవరి సొంత వాహనాల్లో వారు రానుండటంతో కార్లు, ద్విచక్రవాహనాలతో బోర్డర్ లో పెద్దఎత్తున ట్రాపిక్ జామ్ నిండుకుంది.
ముఖ్యంగా ఏపీ-టీఎస్ బోర్డర్ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర భారీగా వాహనాలు నిలిచాయి. ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ఏపీలోకి అనుమతి లేకపోవటంతో టీఎస్ భూభాగంలో వాహనాలు నిలిచి ఉన్నాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలన్నీ రోడ్లపైనే గంటలకొద్దీ నిలిచిపోవడం విశేషం. తెలంగాణలో ఈరోజు నుంచి మొదటి విడతగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దీంతో ఏపీలోకి సొంతూళ్లకు టీఎస్ నుంచి ప్రయాణమైన వారి వాహనాలతో రద్దీ నెలకొంది. 6 గంటల నుంచి 12 వరకు ఏపీలోకి వాహనాల అనుమతి వున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు తెలంగాణ నుంచి ఏపీలోని సొంతూళ్లకు పయనం కావడం విశేషం.