ఏపీలో అక్కడి గ్రామ వాలంటీర్ల పై వేటు….
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 33 మంది గ్రామ వాలంటీర్లపై వేటుపడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా వారిపై వేటు వేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే అసలేం జరిగింది అంటే…. కోవిడ్ ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి ఉన్నట్లు నిర్లక్ష్యంగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన అధికారులు వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
అయితే కోవిడ్ సమయమంలో ఎంతో బాధ్యతగా చేయాల్సిన ఫీవర్ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కారణంగా వారిపై విధుల నుండి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవడం విశేషం. కాగా తొలగించిన గ్రామ వాలంటీర్లు వరుసగా కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు…ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు.