ఎలక్ట్రిక్ బస్సులపై ఏపీ స్పెషల్ ఫోకస్…
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను నడిపే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా 350 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై బిడ్లను ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ… విశాఖకు 100, విజయవాడ, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్, కాకినాడ, అమరావతికి నగరాలకు 50 బస్సులు చొప్పున కేటాయించింది ఏపీ ప్రభుత్వం.
అదేవిధంగా కేంద్రం నుంచి ప్రొత్సహకం రూపంలో బస్సుకు రూ.55 లక్షలు రానున్నాయి. గతంతో పోలిస్తే ఈ-బస్ బ్యాటరీ ధరలు తగ్గాయి. దీంతో 50 శాతం మేర బ్యాటరీ తగ్గడంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది అంటున్నారు ఆర్టీసీ అధికారులు. అంతేకాకుండా ఈ నెల 9వ తేదీలోగా బిడ్లు దాఖలుకు చివరి తేదీ ఖరారు చేయనుంది. కాగా గతంలో ఈ-బస్ల నిర్వహణ ప్రతిపాదనను పరిశీలించి జూడిషీయరీ ప్రివ్యూ అభ్యంతరాలతో వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుండడంతో ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను మళ్లీ తెర మీదకు తెచ్చింది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆ ఎలక్ట్రిక్ వాహనాల తీరు ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.