ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై కేంద్రం దూకుడు
కేంద్రప్రభుత్వం నరేంద్రం మోడీ అధికారంలో సరికొత్త పాలనను ఎంచుకుంది. అధిక లాభార్జన కోసం ప్రభుత్వం సంస్థలను ప్రైవేటీకరిస్తూ నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చకచకా అడుగులు వేస్తుంది. నష్టాలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరించాలని కేంద్రం విధానాన్ని రూపొందించింది. అయితే కరోనా కారణంగా ఆచరణ సాధ్యం కాలేదని, మహారాజాగా పేరొందిన ఎయిరిండియాతోపాటు లాభాల్లో ఉన్న కేంద్ర చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ను ప్రైవేటీకరించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
కాగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఎయిరిండియా, బీపీసీఎల్తో పాటు కాంకర్, షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థలు కూడా ఉండటం విశేషం. అదేవిధంగా ప్రతిపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాల నుంచి ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పు బడుతున్నప్పటికీ.. నష్టాలు, అప్పులు ఉన్నాయనే సాకుతో ప్రైవేటీకరణ తప్ప మరో గత్యంతరం లేదు అంటోంది కేంద్రం. మరింకెన్ని సంస్థలు ప్రైవేటీకరణ కాబోతున్నాయో చూడాలి.