‘ఎఫ్ 3’లో హీరోయిన్ గా సోనల్ చౌహన్
టాలీవుడ్ లో ‘ఎఫ్2’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి సరికొత్త సొబగులు దిద్దుతున్నారు. గత బ్లాక్ బస్టర్ లో ఉన్న వెంకటేశ్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ ఈసారి కూడా కొనసాగుతున్నారు. మరి కొత్తగా కమెడియన్ సునీల్ కూడా యాడ్ అయ్యాడు ‘ఎఫ్3’ స్టార్ క్యాస్ట్ లో. అలాగే ఇప్పుడు వస్తోన్న తాజా సమాచారం ప్రకారం గార్జియస్ బ్యూటీ సోనల్ చౌహన్, అనిల్ రావిపూడి కామెడి ఎంటర్టైనర్ లో కనిపించనుంది అనే టాక్ విస్తృతంగా సాగుతుంది.
అదేవిధంగా సోనల్ చౌహన్ ‘ఎఫ్3’లో నటించటంపై ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రాలేదు కానీ… సోనల్ కోసం డైరెక్టర్ అనిల్ రాసిన క్యామియో బాలీవుడ్ బ్యూటీకి బాగా నచ్చేసిందనే టాక్ విపరీతంగా వినిపిస్తుంది. ఆ వెంటనే ఆ ‘డిక్టేటర్’ బ్యూటీ ఓకే చెప్పేసిందని కూడా ఫిల్మ్ నగర్ టాక్. ‘ఎఫ్3’ సినిమా ‘ఎఫ్2’కి సీక్వెల్ అయినప్పటికీ స్టోరీ మొత్తం వేరుగానే ఉంటుందని సమాచారం అందుతుంది. మరి ఈసారి వెంకీ, తమన్నా, వరుణ్, మెహ్రీన్ పాత్రలు డబ్బు సంపాదనపై విపరీతంగా దృష్టి పెట్టడంతో ఇబ్బందులు వస్తాయనేది లైన్ గా తెలుస్తోంది. కాగా అనిల్ రావిపూడి తన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మరోమారు ఎలా క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇంకా సోనల్ చౌహాన్… స్పెషల్ రోల్ నిజమే అయితే ఎలా మెప్పించగలదు అనేది కూడా వేచి చూడాలి.