ఎన్టీఆర్, అఖిల్ పై ఆర్జీవీ రేంజ్ కామెంట్…

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సెన్షేషన్ క్రియేట్ చేస్తుంది. ఆయన తీసే సినిమాలు మాత్రమే కాకుండా ట్వీట్సే చాలా బజ్ ను క్రియేటే చేస్తాయి. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా ఆర్జీవీకి మంచి పట్టు ఉంది.
అయితే ఇప్పటివరకు రాజకీయనాయకులు, సినిమా హీరోలు, గ్యాంగ్స్టర్స్, ఫ్యాక్షనిస్టులపై సినిమాలు తీసిన వర్మ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు కూడా. ఎప్పుడూ సెటైరికల్ కామెంట్స్ గుప్పించి ప్రజలను రంజింపజేయడంలో ముందుంటారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో జూనియర్ ఎన్టీఆర్, అఖిల్పై సంచలన ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఒక ఈవెంట్లో ఎన్టీఆర్, అఖిల్ కలిసిన సందర్భంలో వాళ్లు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియోను షేర్ చేసిన ఆర్జీవి ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టాల్లో పడినట్లే… అంటూ ఇండైరెక్ట్గా కౌంటర్ వేశారు. ఈ వీడియోలో తారక్ సరదాగా అఖిల్ తొడపై గిల్లడం.. చాలా చనువుగా వీళ్లు ఉండటం మనం గమనించవచ్చు.
ఇదే సమయంలో ఆర్జీవీ చేసిన ట్వీట్పై అటు నందమూరి, ఇటు అక్కినేని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవేమంటే.. ‘రెండు పెగ్గులు పడగానే… ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా’ అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు అభిమానులు. ఇక అంతకుముందు ట్వీట్లో నారా లోకేష్పై వర్మ సెటైర్ వేశారు. అమ్మాయిలను వదిలేసి.. సెల్ఫీలపై పడిపోయాడని ఎద్దేవా చేశారు. ‘అక్కడ తారక్, మరియు అఖిల్ అక్కినేనిల ప్రేమకథ అలా ఉంటే… ఇక్కడ నారా లోకేష్ అమ్మాయిలను వదిలేసి.. సెల్పీలపై పడిపోయాడు.. ఇది స్త్రీ జాతి ముగింపా’ అంటూ వ్యంగ్యాస్త్రాన్ని విసరడం చర్చనీయాంశంగా మారింది.