ఎగచిపడుతున్న పెట్రోల్ మంటలు.. వరసుగా….
దేశంలో ఓ పక్క కరోనా ఉధృతి, మరోపక్క పెట్రోల్ ధరలు వెరసి సామాన్యుడి పాలిట శాపంగా మారాయి. దేశంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే లీటర్ పెట్రోల్ సెంచరీ దాటడం ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచే పెట్రోల్ ధరలు పెరగడం ఆగిపోయాయి. ఆ ఎన్నికలు పూర్తయి పోగానే.. పెట్రోల్ ధరలు పెరగడం మొదలైంది.
అయితే తాజాగా చమురు ధరలు షాక్ ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 33 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.06 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13 కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.47 కు చేరింది. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ ధర రూ. 97.86 కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.17 కు చేరడంతో వాహనదారులు షాక్ కి గురౌతున్నారు.