ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ట్విట్టర్ షాక్…

భారతదేశం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అదేమంటే.. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. అలాగే ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ఉండడంతో.. ఆయన కార్యాలయం నిర్వహిస్తోన్న వీపీ సెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) ఖాతాకు మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్తో కొనసాగిస్తోంది.
అయితే వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి గతేడాది జులై 23వ తేదీన ట్వీట్ చేశారు. ఆయనను దాదాపు 13 లక్షల మంది ట్విట్టర్లో ఫాలో అవుతుండగా.. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు. కాగా ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనేది తెలియడం లేదు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ విషయంలో.. ట్విట్టర్, కేంద్రం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇలాంటివి చేయడం వెనుక రహస్యం తెలియాల్సి ఉంది.