ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్…
కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. అయితే ఈ యువహీరోతో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీగా మారింది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ వలె తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా నిధి మారడం విశేషం.
అయితే దర్శకుడు మిస్కిన్ ‘సైకో’ సినిమాలో చివరి సారిగా కనిపించాడు ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు డైరెక్టర్ మగిల్ తిరుమేనితో కలసి షూటింగ్ మొదలెట్టారు. కాగా ‘తడమ్’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన తిరుమేని ‘రెడ్ జెయింట్ మూవీస్’ బ్యానర్ పై తాజాగా సినిమా చేస్తున్నాడు. ఇది ఉదయనిధి స్టాలిన్ సొంత ప్రొడక్షన్ కంపెనీ కావటం మరో విశేషం. మరి ఉదయనిధి, నిధి అగర్వాల్ స్టారర్ కు అరోల్ కొరెల్లి సంగీతం సమకూర్చనున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.