ఈ జంట పరిచయానికి 11 ఏళ్లు పూర్తి…..

టాలీవుడ్ బ్యూటీ సమంత నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేశావే’. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. ఈరోజుతో ఈ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాకి కింగ్ ఆఫ్ లవ్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సమంత మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత ప్రశంసలు కూడా పొందింది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘జెస్సి’ అంటే గుర్తొచ్చేది సమంత అక్కినేని మాత్రమే అంటే అతిశయోక్తి లేదు.
ఈ సినిమాలోని జెస్సి మాటలను ఇప్పటికి మర్చిపోలేరు ఫ్యాన్స్. గౌతమ్ మీనన్ లవ్ మ్యాజిక్, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అలాగే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే క్లాసికల్ లవ్ స్టోరీలో ‘ఏ మాయ చేశావే’ ఒకటి అని చెప్పకతప్పదు. ఈ సినిమాలో సమంత, అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించగా.. ఆ తర్వాత ఈ జంట ప్రేమలో పడి పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఈ పదకొండేళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దాంతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంతకు సోషల్ మీడియాలో అభిమానులు భారీగా విషెష్ చెప్తుండటం విశేషం. ఎంతైనా మంచి లవ్ తో ప్రేక్షకులను మురిపించి అదే ప్రేమను నిజ జీవితంలో కూడా మాయ చేసేశారు చైతూ శ్యామ్. ఆల్ ది బెస్ట్.. ఏ మాయ చేశావే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *