ఈనెల 20న ఏపీ బడ్జెట్.. రూ.2.38 లక్షల కోట్లతో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ.
అతచే గత సంతవ్సరం ఆదాయానికి సంబంధించిన అంచనాలను చేరుకోలేకపోయింది ప్రభుత్వం. గత ఏడాది సుమారు 1.82 లక్షల కోట్ల వ్యయం కాగా.. ఆదాయం కేవలం 77, 560 కోట్లు మాత్రమే వచ్చిందని అధికారులు అంటున్నారు. గతేడాది రూ. 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ-వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చని చెప్తుంది ఆర్ధిక శాఖ. బడ్జెట్ లోటును ఏ మేరకు చూపాలనే దానిపై అధికారుల తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం… మిగిలిన 9 నెలల కాలానికి ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *