ఈటల బర్తరఫ్ పై రాములమ్మ మండిపాటు…
తెలంగాణలో రాజకీయాల్లో ఓ రకమైన ఉత్కంఠ, అనిశ్చితి అన్నీ కలగలసిన అయోమయ స్థితి నెలకొంది. తాజాగా ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుండి తొలగించిన విషయం తెలిసిందే. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ కు లేఖ పంపింది సీఎం కార్యాలయం. దీంతో ఈటలను తొలగిస్తున్నట్లు మీడియాకు తెలిపింది గవర్నర్ కార్యాలయం.
అయితే ఇలాంటి కీలక పరిణామాల మధ్య బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ లాంటి పనులు తెలివి తక్కువ పనులని.. అర్థరాత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని స్పష్టం చేశారు. ‘ఈ టీఆరెస్లో సస్పెన్షన్, బర్తరఫ్ లాంటి దిమాక్ తక్కువ. మానసిక సమతుల్యత లేని, స్వకుటుంబ స్వార్థపు నిర్ణయాలు. అర్థంపర్థం లేని నిర్ణయాలు అర్థరాత్రి.. అపరాత్రి సమయాల్లో తీసుకోవడం కేసీఆర్ నైజం. ఈటల గారి వ్యవహారంలో మరో మారు తెలంగాణ ప్రజలకు ఇయ్యాల అర్థమైంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం మిగతా తెలంగాణ కబ్జాదారులు, అవినీతిపరులైన ప్రతి టీఆర్ఎస్ నేతలపైన కూడా సమన్యాయంతో పాటించబడుతుందని అభిప్రాయపడుతున్నాను’ అంటూ విజయశాంతి విరుచుకుపడ్డారు.