ఇరిగేషన్ పై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం…

ఆంధ్రప్రదేశ్ లోని ఇరిగేషన్పై సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా… పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. అలాగే స్పిల్వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్ 15 వరకు మిగిలిన పనులు పూర్తి అవుతాయని.. అలాగే ఈనెలాఖరు వరకు స్పిల్ ఛానల్ పనులు పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆధీశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని కూడా వివరించారు. ఇంకా ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్కు లేఖరాశామని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపిన సీఎస్… త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని వివరించారు.
అంతేకాకుండా నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31వరకు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. సంగం బ్యారేజీ పనులు 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి పనులు పూర్తవుతాయని అన్నారు. అలాగే… అవుకు టన్నెల్లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని తెలిపిన అధికారులు… ఇంకా 180 మీటర్ల పని ఉందని.. దానిని వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని స్పష్టం చేశారు. కాగా వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్–1 పూర్తిగా సిద్ధమైందని తెలిపిన అధికారులు… టన్నెల్ –1 హెడ్ రెగ్యులేటర్పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని అన్నారు. అలాగే టన్నెల్ –2 పనులు వేగవంతం చేయాలని… యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని తెలిపిన సీఎం వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *