‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమా యూనిట్పై కేసు..
టాలీవుడ్ లో తాజాగా ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో డైలాగ్స్, పాటలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు నమోదు అయింది. సినిమా ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో ఫిర్యాదు మేరకు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అదేవిధంగా పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు వెలువడ్డాయి. కాగా ఈ సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అందుకు సంబంధించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా యూనిట్పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఆ యూనిట్కు నోటీసులు జారీ చేయనున్నట్లు కూడా పోలీసులు వివరించారు.