ఇక మహారాష్ట్రలో కరోనా ఆసుపత్రులుగా స్టార్ హోటల్స్…
దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా రోజుకి నమోదౌతున్నాయి. అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.
అదేవిధంగా ముంబైలో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొత్తగా ఆసుపత్రులను ఏర్పాటు చేసినా సరిపోవడంలేదు. అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్లను కరోనా ఆసుపత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా స్వల్ప లక్షణాలు ఉన్న రోగులను, క్రిటికల్ కేర్ యూనిట్లు అవసరం లేని వ్యక్తులను స్టార్ హోటళ్లలో ఉంచి ట్రీట్మెంట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.