ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగంపై గళం…
తెలంగాణలో ఈ మధ్యనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని.. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో పోరాటం చేశారని… అయితే తెలంగాణ వచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్య తీరిపోలేదని ఆమె గత కొంతకాలంగా పోరాడుతూ నిరసన గళం విప్పుతున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికీ నిరుద్యోగుల విషయంలో ఆమె తన నిరసలు చేస్తూనే ఉన్నారు.అదేవిధంగా తెలంగాణలోని యువతకు మద్దతుగా వైస్ షర్మిల పోరాటం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రేపు వనపర్తి నియోజక వర్గంలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరసన దీక్షచేయబోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగనుంది. మొత్తానికి వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత నిరసన దీక్షలతో ప్రభుత్వంపై మరింత ఎక్కువగా గళం విప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.