ఇండియాలో 2లక్షలు దాటిన కరోనా కేసులు…

ఇండియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుది. అయితే ఈరోజు మునుపెన్నడూ లేనంతంగా కేసులు నమోదయ్యాయి.
తాజాగా కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,00,739 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది. ఇందులో 1,24,29,564 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 14,71,877 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో 93,528 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కరోనా బులెటిన్ లో వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1038 మంది మృతి చెందారని.. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరిందని కేంద్రం స్పష్టం చేసింది.