ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. ఇండియా నుంచి వస్తే జైలుకే…

ఇండియాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న ఈ తరుణంలో ఇతర దేశాలు భారత్ పై తీవ్ర ఆంక్షలు పెడుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్లో ఉన్నవాళ్లు ఇప్పట్లో ఆస్ట్రేలియా రావద్దని నిషేధం విధించింది. ఇది ఎవరైనా అతిక్రమిస్తే.. ఐదేళ్లు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. అయితే ఆసీస్ అత్యవసరంగా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం.. తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడమే శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. మే 3వ తేదీ నుంచి తమ ఆదేశాలను కాదని స్వదేశంలో అడుగుపెడితే.. జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
అదేవిధంగా ఈ నిర్ణయం అంత ఆషామాషీగా తీసుకోలేదని.. ఆస్ట్రేలియన్ల ఆరోగ్యం మాకు ముఖ్యమని.. క్వారంటైన్లోని కరోనా కేసుల సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా తెలిపింది. అంతేకాకుండా ఈ ఆంక్షలపై మే 15వ తేదీ తర్వాత సమీక్షిస్తాని వివరించింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిని జాతి వివక్షగా ఇండియన్-ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లు సమాచారం. యూఎస్, యూకే, యూరప్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. వారిపై లేని ఆంక్షలు తమపై ఎందుకని నిలదీస్తున్నారు. ఇండియాను టార్గెట్ చేయడం దారుణమని నెట్టిజెన్లు మండిపడుతుండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *