ఆసక్తి రేపుతున్న ప్రియమణి ఎఫైర్….
మనోజ్ బాజ్పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’. రాజ్, డికె రూపొందించిన ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అయితే ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించనుంది.
అయితే జూన్ 4వ తేదీన విడుదల కానున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అందరినీ ఆసక్తి రేపుతుంది. ఈ సిరీస్లో మనోజ్ బాజ్పేయి, ప్రియమణిల ట్రాక్ సీజన్ వన్ లో ప్రశంసలు అందుకుంది. భర్తగా నటించిన మనోజ్ బాజ్పాయ్ తో సమస్యలు ఉన్న భార్య పాత్రలో ప్రియమణి చాలా చక్కగా నటించింది. అయితే ఫస్ట్ సీజన్ లో ప్రియమణి పాత్రకు సంబంధించిన ఒక విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు మూవీ మేకర్స్. ప్రియమణి తన కొలీగ్ లో ఎఫైర్ నడుపుతుందా ? లేదా ? అన్నదే ఆ సస్పెన్స్. ఇప్పుడు “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” విడుదలకు రెడీగా ఉండటంతో ఈ ఉత్కంఠపై అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రియమణి రెండో సీజన్లో అన్నీ బయటపడతాయని, ప్రేక్షకులు సీజన్-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడటం ఎంతో ధ్రిల్లింగ్ గా ఉందని తెలిపారు. మొత్తానికి త్వరలోనే ప్రియమణి ఎపైర్ విషయం కూడా తేలిపోనుంది అన్నమాట.