ఆళ్లగడ్డలో పోటీకి టీడీపీ రెడీ
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే ఎస్ఈసి రిలీజ్ చేసింది. ఈనెల 8వ తేదీన ఎన్నికలు, 10వ తేదీన ఫలితాలు వెలువడతాయి.
అయితే ఆ ఎన్నికలను సవాల్ చేస్తూ వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఇలా ఉంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మాజీమంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఇక్కడ అభ్యర్థులు నామినేషన్ లు వేశారు కాబట్టి అభ్యర్థులు ఇళ్లలో కూర్చోరని, కష్టమో.. నష్టమో పోటీలో ఉంటారని ఆమె వెల్లడించారు. అదేవిధంగా బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చేయండి అంటూ ఆమె వివరించారు. కాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొంతమంది తాజాగా టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.