‘ఆర్సి 15’ కోసం శంకర్ కు భారీ రెమ్యునరేషన్..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్ దీనిని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శంకర్ పలు వివాదాలలో ఇరుక్కోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా ? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ.. ఈ మధ్య రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజుతో కలిసి శంకర్ ను కలవడం, ఆ తర్వాత త్వరలోనే అప్డేట్ ను ఇస్తామని ప్రకటించడంతో ఆ సందేహాలన్నీ పటాపంచలై పోయిన విషయం కూడా తెలిసిందే. దీంతో త్వరలోనే ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కు శంకర్ పారితోషికం విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అదేమంటే… ఆయన ఈ సినిమాకి ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ శంకర్ మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన అతి తక్కువ మంది దర్శకుల జాబితాలో ఒకరుగా చెప్పవచ్చు. కాగా ఆయన పారితోషికం అంత పుచ్చుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీ విజయవంతం అవుతుందని నమ్మడంతో ఆయనకు అడిగినంత చెల్లించడానికి సుముఖంగానే ఉన్నారని కూడా సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయనకు కూడా భారీగానే పారితోషికం ముట్టనుందని తెలుస్తోంది. చూద్దాం ఇందులో ఏది నిజమో.