ఆర్జీవీ సంచలన ట్వీట్… ఆనందయ్యను కాపాడండి..!

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేదం వైద్యుడు ఆనందయ్య పేరు ప్రస్తుతం మారు మోగిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో ఆయన కరోనాకు ఉచితంగా మందు పంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనందయ్య ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి పరుగులు పెడుతున్నారు.
అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ మందుపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెరైటీగా స్పందించారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి వర్మ తనదైన శైలిలో కామెంట్లు గుప్పించారు. ‘ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డా. ఫౌసీ వస్తున్నారని విన్నాను. ఆనందయ్యతో కరోనా రేసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికే కావచ్చు. ఇదే సమయంలో ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి.. మిలటరీ భద్రత కల్పించాలి. అంతే కాకుండా ఉచితంగా ఆనందయ్య మందు ఇవ్వడం గొప్ప నిర్ణయం. అతనికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలి’ అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *