ఆర్ఆర్ఆర్ లో సీత్ లుక్ అప్డేట్ వచ్చేసిందండోయ్…
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఆర్ఆర్ఆర్ టీమ్ ఏదో ఒక అప్డేట్ నిత్యం ఇస్తూనే ఉంది.
అయితే తాజాగా ‘సీత’ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటీమణి అలియా భట్ ఫస్ట్ లుక్ ను మార్చి 15వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ సరసన అలియా సీతగా కనిపించనుంది. ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ ఒలీవియా మారిస్ నటిస్తుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులపై క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 13న భారీ ఎత్తున విడుదల కానుంది.