ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి స్పెషల్ లుక్ వైరల్….
రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టోరీ రాసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈయన తాజాగా ఆర్ఆర్ఆర్ గురించి ఓ విషయం చెప్పి సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. అదేమంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్ లో కన్పించనున్నారని చెప్పారు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పేశారు. ఆ లుక్ చూస్తే మెగా అభిమానులు సంతోషపడడం ఖాయమని కూడా వెల్లడించారు. ఇంతకీ ఆ లుక్ ఏమిటంటే చరణ్ ఈ సినిమాలో పోలీస్ గెటప్ లో కన్పించబోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పోలీసు అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ ఉందని.. అది తెరపై ఎంతో ఆశ్చర్యం రేపేలా మరింత ఆనందాన్ని కలిగించేలా ఉంటుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే రామ్ చరణ్ పోలీసు లుక్ ను రివీల్ చేయడంపై సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా అందరి దృష్టినీ సినిమాపై మరింత ఆకట్టేలా చేసింది. అలాగే చరణ్ చివరిగా విడుదలైన ‘సీతారామ రాజు’ టీజర్లో పోలీసు అధికారిగా కనిపించారు. కాగా చరణ్, తారక్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్ షూటింగ్లో ఉన్నారు. అయితే ఫైనల్ షెడ్యూల్ కోసం వీరు త్వరలో జార్జియాకు వెళ్లనున్న విషయం తెలిసిందే.