ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టిన ‘వాలిమై’..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వాలిమై’ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చారు సినిమా యూనిట్. అయితే ‘వాలిమై’ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేసింది. తాజాగా ‘వాలిమై’ ఫస్ట్ లుక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రికార్డ్స్ ను మించిపోవడం విశేషం.
అదేమంటే.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి కూడా అన్ని భాషల సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్ కు 16 గంటల్లో 463కే లైక్స్ వస్తే… ‘వాలిమై’కు 1 మిలియన్ ప్లస్ లైక్స్ రావడం విశేషం. అజిత్ ఫ్యాన్సా మామూలు హంగామా చేయలేదు. మొత్తానికి విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డులను తిరగరాసింది ‘వాలిమై’. కాగా ఇప్పటికే ట్రెండ్ అవుతున్న ఈ ఫస్ట్ లుక్ ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చేడాల్సిందే.