ఆనందయ్య మందు పై మరింత ఉత్కంఠ…..!

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఆనందయ్య కరోనా మందుపై ఈరోజు తుది నివేదిక వచ్చే అవకాశం ఉందని శుక్రవారం ప్రకటించారు ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు. అయితే.. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నివేదికకు మరో రోండు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈరోజు, రేపు కేంద్ర సంస్థలకు సెలవు కావడంతో నివేదిక సోమవారమే అంటున్నారు నిపుణులు. అలాగే అత్యవసరంగా భావిస్తే తప్ప ఈరోజు నివేదిక రావడం అనుమానమే అని సమాచారం అందుతుంది. అలాగే హైకోర్టులో అనుమతులు వస్తేనే ఆనందయ్య మందు పంపిణీ చేసే అవకాశం ఉంది. తన మందుని పంపిణి చేసేలా ఉత్తర్వులు ఇవాల్సిందిగా హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాలని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు. ఆనందయ్య మందు పంపిణి సందర్భంగా భౌతిక దూరం పాటించడం లేదన్న కారణంతోనే మందు పంపిణీని అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
కాగా ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనమే అని తెలుస్తోంది. సీసీఆర్ఏఎస్ కి సానుకూల నివేదిక పంపిందట విజయవాడ పరిశోధన కేంద్రం. విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్ రాలేదంటు నివేదికలో పేర్కొన్నట్టు సమచారం అందుతుంది. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. ప్రభుత్వం ద్వారానే మందు పంపిణీ చేసే యోచనలో సర్కార్ ఉంది. కాగా రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నారని, ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీంత ఆనందయ్య మందుపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *