ఆనందయ్య మందు పంపిణీ పై తీవ్ర ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు రోజులుగా సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ చివరకి మరో రెండు రోజులు ఆలస్యం అవుతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఆనందయ్య మందు పంపిణీపై తీవ్ర గందరగోళం నెలకొంది.
అసలు ఈరోజు నుంచి మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య చెప్పగా నిన్న సాయంత్రమే వార్డు వాలంటీర్లు, అనుచరులు ఇంటింటికీ మందు పంపిణీ చేసారు ఆనందయ్య టీం. కానీ ఈరోజు ఆనందయ్య మందు పంపిణీపై సృష్టత రాలేదు. అలాగే మందు పంపిణీపై క్లారటీ ఇవ్వాలంటూ ఆనందయ్య ప్రభుత్వ అధికారులైన ఆర్డీవో, డిఎస్పీఇతర అధికారులతో చర్చిస్తున్నారు. అయితే కృష్టపట్నం మందు పంపిణీ లేదని మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గంలో… ఆ తర్వాత జిల్లాకు ఐదు వేల ఫ్యాకేట్ల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా అసలు ఇప్పుడు మందు ఇస్తారో… లేదో… అసలు ఎమీ జరుగుతుంది అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఏమీ అర్ధం కాక తీవ్ర ఆవేదనకు లోనౌతున్నారు కరోనా బాధితులు. మరి ఎప్పటి నుంచి మందు పంపిణీ చేస్తారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.