ఆనందయ్య మందు- జంతువులపై ట్రయల్స్…

ఆంధ్రప్రదేశ్ లోని ఆనందయ్య తయారు చేసిన మందుపై విజయవాడ, తిరుపతి ఆయుర్వేద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే ఓ వైపు మందు తీసుకున్న వ్యక్తులకు సంబందించిన డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు జంతువులపై ఈ మందును ట్రయల్స్ కూడా నిర్వహించేందుకు అధికారులు రెడీ అయ్యారు.
అదేవిధంగా తిరుపతిలోని మంగాపురం వద్ద ఉన్న యానిమల్ ల్యాబ్లో జంతువులపై పరిశోధన చేయనున్నారు. ఈ పరిశోధనలకు సంబందించిన నివేధిక 14 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే 4దశల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందుని సరఫరా చేస్తామని చెవిరెడ్డి తెలిపారు. కాగా మందు పంపిణీకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.