ఆనందయ్య క్రెడిట్ కోసం బాబు గుంటనక్కలా ఎదురుచూపు..
ఆంధ్రప్రదేశ్ టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని గుంట నక్కలా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడని మండిపడ్డారు.
అయితే ఆయన ఏమన్నారంటే… ‘నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చిం చుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట నక్కలా. నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను వారు మరోలా అర్థం చేసుకున్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు పత్తిపాటి పుల్లన్న. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి… విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడింది’ అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.