ఆదిపురుష్ లో ఈ అందాల భామ….
బాలీవుడ్ లో తీవ్రంగా చర్చించుకుంటున్న అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీరాముడిగా… దర్శకుడు ఓంరౌత్ నిర్మిస్తున్న మైటీ మైథాలాజికల్ మూవీ ఇది. ఈ సినిమా కోసం ఇప్పటికే సైఫ్ అలీఖాన్ కన్ఫర్మ్ అయ్యాడు. ఆయన రావణుడి పాత్రలో మెయిన్ విలన్ గా అలరించనున్నాడు. ప్రభాస్ సరసన సీతగా నటించేది ఎవరో కూడా ఈ మధ్యే తేలిపోయింది. ‘వన్’ మూవీ టాలెంటెడ్ బ్యూటీ కృతీ సనోన్ ‘ఆదిపురుష్’లో ఫీమేల్ లీడ్ చేస్తుంది. అలాగే మరో వెండితెర రామాయణంగా రూపొందనున్న ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్రధారి ఎవరన్నది కూడా తెలిసిపోయింది. ప్రభాస్ సోదరుడిగా బీ-టౌన్ యాక్టర్ సన్నీ సింగ్ నటించనున్నాడు. కాగా ఇప్పుడు మరో కీలక పాత్రకి సీనియర్ యాక్ట్రస్ కాజోల్ పేరు వినిపిస్తోంది.
ముఖ్యంగా కాజోల్ దేవగణ్ దక్షిణాది ప్రేక్షకులకి సుపరిచితమే. అప్పట్లో ‘మెరుపు కలలు’ వంటి సినిమాలో నటించింది. కొన్నాళ్ల క్రితం ధనుష్ తోనూ ‘విఐపీ’ మూవీలో అలరించింది. ఇక హిందీలో అయితే కాజోల్ కి స్టార్ హీరోయిన్ గా మంచి పాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆమెగానీ ‘ఆదిపురుష్’ టీమ్ లో జాయిన్ అయితే మూవీ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నది టీం ఆలోచన. అయితే ప్రభాస్, కృతీ సనోన్ స్టారర్ లో కాజోల్ నటించటం నిజమే అయితే.. ఆమె చేయబోయే పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అజయ్ దేవగణ్ తో ఓం రౌత్ రూపొందించిన ‘తానాజీ’లోనూ కాజోల్ మంచి రోల్ పోషించిన విషయం తెలిసిందే.