ఆదిపురుష్ లోకి మరో ప్రముఖ నటుడు….!

భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నసినిమాల లిస్ట్ లో మరో ప్రముఖ హీరో చేరినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ పేర్లను ఖరారు చేసినట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు.
అయితే తాజగా ఈ లిస్ట్ లో వత్సల్ శేత్ అనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు చేరిపోయాడు. అతను సూపర్ హిట్ కామెడీ సిరీస్ ‘తారక్ మెహతా కి ఓల్తా చష్మా’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అలాగే ‘న్యూ బిగినింగ్స్ # ఆదిపురుష్’ అని ట్వీట్ చేయడంతో తాను ఆదిపురుష్ తారాగణంలో ఒక భాగమని వత్సల్ స్వయంగా ధృవీకరించారనే తెలుసుకోవాలి. కాగా మేకర్స్ ప్రధానంగా ఉత్తరాదిపై ఫోకస్ చేస్తున్నందున సినిమాలో ఎక్కువమంది హిందీ నటీనటులే కనిపించనున్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్ ఈ బహుభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.